బంట్వారం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పెండ్యాల చంద్రకిరణ్ అన్నారు.శుక్రవారం ఎంఈఓ చంద్రప్పతో కలిసి కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించారు. వసతి గృహంలో సౌకర్యాలు, భోజనం, పరిశుభ్రత, బాలికల భద్రత తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రణాళితో ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చ దవాలన్నారు. ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేసుకోరాదన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ము ఖ్యమన్నారు. జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని పేర్కొన్నారు. చెడు అలవాట్లు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని తెలిపారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు జయం బుక్స్ అందజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పల్లవిరెడ్డి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


