బంట్వారం: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పెండ్యాల చంద్రకిరణ్ అన్నారు. శనివారం ఎంఈఓ చంద్రప్పతో కలిసి కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించారు. వసతి గృహంలో సౌకర్యాలు, బాలికల భద్రత తదితర అంశాలపై ఆరా తీశారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని తెలిపారు. సమయాన్ని వృథా చేయరాదన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. చెడు అలవాట్లకు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పల్లవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


