ప్రియుడే హంతకుడు | - | Sakshi
Sakshi News home page

ప్రియుడే హంతకుడు

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

కుల్కచర్ల: అదృశ్యమైన మహిళ విగతజీవిగా కనిపించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె హత్యకు గురైంది. ప్రియుడి మోజులో పడి తిరిగిరానిలోకాలకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన అమృతమ్మ(34)కు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యతో వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి చెల్లాపూర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. అప్పుడప్పుడూ కుల్కచర్లలోని అత్తవారింటికి వచ్చి వెళ్తోంది. ఈక్రమంలో అదేగ్రామానికి చెందిన మంగలి ఆనంద్‌(28)తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఇల్లు చూసి వస్తానని..

కుల్కచర్లలోని ఇల్లును చూసి వస్తానని చెప్పిన అమృతమ్మ గత నెల 18న చెల్లాపూర్‌ నుంచి బయల్దేరింది. మూడు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపంచలేదు. దీంతో 29న కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రమేష్‌ కేసును దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా అమృతమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మంగలి ఆనంద్‌ ఆమెను హత్యచేసినట్లుగా గుర్తించారు.

ఆభరణాలు అడగడంతోనే..

ఆనంద్‌తో సన్నిహితంగా ఉంటున్న అమృత అతని అవసరాల నిమిత్తం బంగారు, వెండి ఆభరణాలను ఇచ్చింది. వీటిని తనఖా పెట్టిన ఆనంద్‌ రూ.2 లక్షలు తీసుకుని వాడుకున్నాడు. తన నగలు ఇవ్వాలని పదేపదే అడుగుతుండటంతో అమృతమ్మను చంపాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్‌ 18న కొత్తపల్లిలో ఆమెను కారు ఎక్కించుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలం వెన్నాచెడ్‌ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి చీరకొంగును మెడకు బిగించి హత్యచేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం ముందస్తు పథకం ప్రకారం తెచ్చుకున్న డీజిల్‌ పోసి నిప్పంటించాడు. మృతదేహం కాలకపోవడం, అప్పటికే ఎక్కువ సమయం కావడంతో ఆందోళనకు గురై బాడీని మూట కట్టి కారులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణ జిల్లా తుంగభద్ర నదీ పరీవాహక అటవీ ప్రాంతంలో పడేశాడు. విచారణ అనంతరం మృతదేహం మూటను పోలీసులు గుర్తించారు. శవపంచనామా నిర్వహించారు. అదృశ్యం కేసును హత్యకేసుగా మార్చి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వీడిన వివాహిత అదృశ్యం కేసు

తీసుకున్న నగలను తిరిగి

ఇవ్వమంటోందని ఘాతుకం

చీరకొంగును గొంతుకు బిగించి

చంపిన నిందితుడు

డీజిల్‌ పోసి తగలబెట్టి.. మృతదేహాన్ని మూటగట్టి పడేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement