ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

● పట్టభద్రుల ఎమ్మెల్సీగా

రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి

● అర్హులు ఓటు నమోదు చేసుకోవాలి

● పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌

తాండూరు: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని పట్టభద్రులకు 60 వేల ఉద్యోగాలు వచ్చాయని ఆ ఘనత తమకే తక్కుతుందని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ – మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డిని పేరును కాంగ్రెస్‌ అఽధిష్టానం ప్రకటించిందన్నారు. ఆయన్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి వంద మంది పట్టభద్రులకు తన సొంత పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement