రెవెన్యూ విధులపై విమర్శలు! | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ విధులపై విమర్శలు!

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

● రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో

సంబంధం లేని వ్యక్తుల వినియోగం

● ప్రభుత్వం తొలగించిన

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పనులు

● పథకం ప్రకారమేనంటూ

బాధితుల ఆరోపణలు

దోమ: ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల విధుల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోమ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జీపీఓలు, వీఆర్‌ఏలు తదితర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇతర వ్యక్తుల ప్రమేయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక సిబ్బంది ఉండగానే ప్రైవేట్‌ వ్యక్తులతో కంప్యూటర్‌, స్కానింగ్‌ తదితర పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భూ భారతి ఆపరేటర్‌(జూనియర్‌ అసిస్టెంట్‌) వినోద్‌ విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. కుల్కచర్లకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆనంద్‌ను దోమ కార్యాలయానికి తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దోమలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ నర్సింహులు సెలవుపై వెళ్లాడు. అయినప్పటికీ ఇక్కడ తహసీల్దార్‌ రవీందర్‌ విధులు నిర్వహిస్తుండగా, కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌కు భూ భారతి బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్‌ సోర్సింగ్‌ భూ భారతి ఆపరేటర్లను ప్రభుత్వం తొలగించినప్పటికి దోమలో ఇన్‌ఛార్జ్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా కొనసాగుతున్న చంద్రశేఖర్‌.. ఆనంద్‌ను తీసుకువచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇతను అనేక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.

ఇతన్ని తెచ్చింది అందుకేనా..?

దోమ మండలం మోత్కూర్‌ గ్రామంలో సర్వేనంబర్‌ 547, 548 లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఇదే గ్రామానికి చెందిన బాధిత రైతులు సంపల్లి చంద్రయ్య, చెన్నయ్య, రమేష్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, నరేష్‌ భాగస్వామ్య పంపకాలు జరిగిన తర్వాతనే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారుల వద్ద వేడుకుంటున్నప్పటికి.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించేందుకు కుల్కచర్ల డీటీ చంద్రశేఖర్‌ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆనంద్‌తో డాక్యుమెంట్లు స్కాన్‌ చేయించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంత వేడుకున్నా డీటీ వినకుండా భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాడని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement