● అసంపూర్తిగా కాల్వలు
● ఇబ్బందుల్లో స్థానికులు
●
కాల్వలు పూర్తి చేయాలి
మా గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి. కాల్వల కోసం తవ్విన గోతుల్లో పశువులు, మనుషులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులను వెంటనే పూర్తి చేయాలి.
– భీములు, బూల్కాపూర్
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణ పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మురుగు నీరు రోడ్లపై పారుతోందని వాపోతున్నారు. బూల్కాపూర్‌లో కాల్వల కోసం తవ్విన గోతుల్లో పిల్లలు, మూగ జీవాలు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు కాలనీలకు సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. దోమల బెడద అధికంగా ఉంది. అంతర్గత డ్రైనేజీ కోసం తవ్వకాలు చేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.


