ఓటు హక్కు నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

మర్పల్లి: పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మర్పల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పబ్బే మధుకర్‌ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ రమేశ్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌ రెడ్డి, రైతు బంధు మండల మాజీ అధ్యక్షుడు నాయబ్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ యూత్‌ మండల మాజీ అధ్యక్షుడు మధుకర్‌, కోఆప్షన్‌ మాజీ సభ్యులు, పార్టీ ఉపాధ్యక్షులు అశోక్‌, రాచన్న, ప్రధాన కార్యదర్శి రమేష్‌ మిత్ర, నాయకులు మంగలి రమేశ్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మధుకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement