రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోండి

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

మూడు మిల్లీమీటర్ల గణేశుడు

‘చేయూత’కు 1,148 దరఖాస్తులు

పెన్సిల్‌ లిడ్‌పై చెక్కిన మైక్రో ఆర్టిస్ట్‌ మణిసాయి

తాండూరు టౌన్‌: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్టు మణిసాయి పెన్సిల్‌ లిడ్‌పై గణేశుడు ప్రతిమను చెక్కాడు. మూడు మిల్లీమీటర్ల పొడవులో పెన్సిల్‌ లిడ్‌పై చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతేడాది 7 మిల్లీమీటర్ల పొడవులో చెక్కగా ఈ ఏడాది కేవలం మూడు మిల్లీమీటర్ల పరిధిలోనే చెక్కినట్లు ఆయన తెలిపాడు. ఏటా పలు పర్వదినాలను, జయంతి వేడుకలు, పలు దినోత్సవాలను పురస్కరించుకుని పెన్సిల్‌ లిడ్‌పై చిత్రాలను చెక్కడం హాబీగా ఏర్పర్చుకున్నాడు.

అనంతగిరి: ప్రతి వినాయక మండపాన్ని అధికారులు స్వయంగా పరిశీలించి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర సిబ్బందికి సూచించారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సేబర్‌ నేరాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గణేశ్‌ మండపాలను తరచూ పరిశీలించాలన్నారు. నిమజ్జన మార్గాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. నిమజ్జన సమయంలో బారికేడ్లు, వాహనాల మళ్లింపుపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

అభినందించిన ఎస్పీ

జిల్లాలో ఇటీవల ఏఎస్‌ఐ నుంచి ఎస్‌ఐగా పదోన్నతి పొందిన నారాయణమ్మ, సంగమేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన శంకరయ్య, కిష్టయ్య, పాండు, జైపాల్‌రెడ్డిను మంగళవారం ఎస్పీని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పదోన్నతి పొందిన వారిని అభినందించారు.

మాట్లాడుతున్న ఎస్పీ స్నేహమెహ్ర

తాండూరు రూరల్‌: చేయూత పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగిసింది. తాండూరు మండలం నుంచి 1,148మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో వితంతు పింఛన్ల కోసం 780మంది, ఒంటరి మహిళలు –125, దివ్యాంగులు – 192, కల్లు గీత కార్మికులు –51 అర్జీలు పెట్టుకున్నారు. పెద్దేముల్‌ మండలంలో 1,010 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వితంతు పింఛను కోసం 691 మంది, ఒంటరి మహిళలు –138, దివ్యాంగులు – 175, కల్లు గీత కార్మికుల నుంచి ఆరు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి

ప్రతి మండపాన్ని పరిశీలించాలి

ఎస్పీ స్నేహమెహ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement