తాండూరు: సీఎంగా, ప్రధాన మంత్రిగా మోదీ 25 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17నుంచి నిర్వహించే సేవా అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగు పడిందన్నారు. దేశ వ్యాప్తంగా అనేక జాతీయ రహదారులు నిర్మించినట్లు చెప్పారు. రైల్వే శాఖను మరింత మెరుగు పర్చారని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవిలతో నగదు బదిలీలను సులభతరం చేశారని అన్నారు. దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేశారని తెలిపారు. నెల రోజుల పాటు 25 అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛత సేవ, మొక్కలు నాటడం, అనాఽథ, వృద్ధుల ఆశ్రమాల సందర్శన, ప్లాస్టిక్ రహిత సమాజం, మహిళల ఆరోగ్యం, అవయవ దానం, నీటి సంరక్షణ, క్రీడలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, జిల్లా సేవా సంకల్ప కన్వీనర్ వివేకానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు శ్రీశైలం, పటేల్ విజయ్, బంటారం భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
17నుంచి సేవా అభియాన్ కార్యక్రమాలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం


