ప్రముఖులకు ఆహ్వానం
తాండూరు టౌన్: పట్టణంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సంఘం నాయకులు మంగళవారం నగరంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిను కలిసి వేడుకలకు రావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు కరణం పురుషోత్తం రావు, ప్రతినిధులు పులీందర్ చారి, గద్దె శ్రీనివాసాచారి, రవీందర్ చారి, కందనెల్లి శ్రీనివాసాచారి తదితరులు ఉన్నారు.
తాండూరు టౌన్: గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయనే అనుమానంతో తాండూరు ఎకై ్సజ్, పట్టణ పోలీసులు మంగళవారం పట్టణంలోని పలు దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల్లో ఎలాంటి గంజాయి లభ్యం కాలేదు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరిగి: మండలంలోని సయ్యద్‌పల్లికి చెందిన రావులపల్లి రాములకు గౌరవ డాక్టరేట్ లభించింది. సామాజిక సేవ, విద్య, బాలల సంక్షే మం, ఆపరేషన్ ముస్కల్, ఎంవీఎఫ్ తదితర కా ర్యక్రమాల ద్వారా ప్రజలు, చిన్నారులకు సేవలందించారు. ఇందుకు గాను మ్యాజిక్ బుక్ రి కార్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ గీ తాంజలి శర్మ, ఎంబీఆర్ చైర్మన్ సీవీ యాదవ్‌ల చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
డీఏఓ కవిత
పరిగి: నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి కవిత అన్నారు. రైతులు సాగులో నూతన పద్ధతులు పాటించాలని సూచించారు. మంగళవారం పరిగి పట్టణ పరిలోని నస్కల్ గ్రామ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసాయన రహిత వ్యవసాయమే లక్ష్యంగా రైతులు ముందుకు సాగాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరగడంతోపాటు సాగు ఖర్చులు తగ్గుతాయని, అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం రైతులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ అరుణ, ఏఓ రజిత, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలోని లాలాగూడ పోచమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి హుండీ చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం ఉదయం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయం తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా హుండీ కన్పించలేదు. అందులో కొంత నగదు, భక్తులు సమర్పించిన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. చోరీ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు ఆలయాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.


