బొంరాస్‌పేట: దుద్యాల మండల కేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జింక అనంతమ్మ, బాలప్ప దంపతులకు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు జింక బాల్‌రాజ్(36) ఆదివారం అర్ధరాత్రి తన ఇంటి పక్కనే మృతి చెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం ఉదయాన్నే జాగిలాలతో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి అన్న జింక వెంకటయ్య, తమ్ముడు కృష్ణను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారణ నిర్వహించారు. త్వరలోనే కేసు ను ఛేదించి, వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు.


