తాండూరు: ఏళ్ల తరబడి అద్దె చెల్లించని కారణంగా మున్సిపాలిటీకి చెందిన రెండు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. రెండు షాపులకు సంబంధించి రూ.28 లక్షల బకాయి పేరుకుపోయింది. దీంతో కౌన్సిలర్ మల్లేశం సమక్షంలో మంగళవారం మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు.
బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
దౌల్తాబాద్: మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్ సమీపంలో బైక్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దామరగిద్ద మండలం మొగులమడ్క గ్రామానికి చెందిన చంద్రప్ప(28), ఎల్లప్ప సొంత పని మీద ద్విచక్ర వాహనంపై మద్దూరుకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో దేవర్‌ఫసల్‌వాద్ సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. చంద్రప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లప్పకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మద్దూరు అస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రేణుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుకుమార్ తెలిపారు. చంద్రప్పకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
గిరిజన విద్యార్థికి
ఎంబీబీఎస్ సీటు
కుల్కచర్ల: గోరిగడ్డతాండకు చెందిన అనీష్‌కుమార్ ఎంబీబీఎస్ సీటు సాధించాడు. మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీలో సీటు పొందాడు. మారుమూల గిరిజన ఆవాసానికి చెంది న యువకుడు ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించడంపై తండావాసులు హర్షం వ్యక్తంచేశారు.
శంకరయ్యకుఏఎస్‌ఐగా పదోన్నతి
కుల్కచర్ల: కుల్కచర్ల పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య ఏఎస్‌ఐగా పదోన్నతి పొందారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ స్నేహ మెహ్రా బ్యాడ్జీ అలంకరణ చేసి అభినందించారు.
మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ.కోటి వరకు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణ శివారులోని ఈద్గా వద్ద రూ.35 లక్షలతో చేపట్టిన ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, ప్రార్థన మందిరాలు, ఈద్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఈద్గా కమిటీ చైర్మన్ యూసుఫ్‌ఖాన్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, ఉర్దూఘర్ చైర్మన్ జలాల్, నాయకులు బాల్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


