అనంతగిరి: బ్లడ్ స్టోరేజీ యూనిట్‌ను ప్రత్యేకంగా ప్రమాణాలకు అనుగుణమైన గదిలో నిర్వహించాలి కాని జనరల్ వార్డుకు సంబంధించిన గదిలో నిర్వహించడం ఏమిటని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం వికారాబాద్‌లో ఆయన పలువురు నాయకులతో కలిసి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లడ్ కలెక్షన్ , బ్లడ్ బ్యాంకు నిర్వహణకు అవసరమైన మెడికల్ ఆఫీసర్ పోస్టు గత రెండేళ్లుగా భర్తీ కాలేదన్నారు. ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ఎపుడు అందుబాటులో తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో వైద్య సేవలు సమర్థవంతంగా అందకపోతే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన అసలు లక్ష్యమే దెబ్బతింటుందన్నారు. బ్లడ్ బ్యాంక్‌ను ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంటనాయకురాలు డాక్టర్ స్వప్న, నాయకులు మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజశేఖర్‌రెడ్డి


