కొడంగల్ రూరల్: బీచ్‌పల్లిలోని టీజీఎస్‌పీ 10వ బెటాలియన్ వద్ద ఈ నెల 16నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ తరగతులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఊదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు వి.సికిందర్, జి.మోహన్, ఆసిఫ్‌పాషా, కె.శివ, ఎస్.మనోజ్‌ను అభినందించారు. యువ ఆపదమిత్ర పథకం రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌డీఆర్‌ఎఫ్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ దళం సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందన, సమాజస్థాయి, అత్యవసర నిర్వహణ, విపత్తు నిర్వహణ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమని అన్నారు. విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, సమాజ సేవా, విపత్తు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాల పెంపు తదితర అంశాలపై విద్యార్థులకు దోహదపడుతుందన్నారు. ఇటువంటి ప్రతిష్టాపన శిక్షణకు ఎంపికయిన విద్యార్థులను ఆయన అభినందించారు.
అభినందించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి


