జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్
కుల్కచర్ల: వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి సుధా కర్ లాల్ ఆదేశించారు. శనివారం మండలంలోని బొంరెడ్డిపల్లి సబ్ సెంటర్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోరింత దగ్గు, పోలి యో, హైపటైటీస్, మీజిల్స్ సంబంధ వ్యాధుల నివారణకు పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినే షన్ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్ గౌడ్, వైద్య సిబ్బంది రాధ, సుజాత పాల్గొన్నారు.


