అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

అ‘పూర్వ’ సమ్మేళనం దుద్యాల్‌: మండల పరిధిలోని హకీంపేట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు 21 ఏళ్ల అనంతరం ఒకే వేదిక పంచుకున్నారు. ఈ పాఠశాలలో 2005–06లో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జ్ఙాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం వారికి భోదించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పేకాట స్థావరాలపై పోలీసుల దాడి కొత్తకొత్తగా ఉన్నది.. చికిత్స పొందుతూ యువకుడి మృతి మహిళ బలవన్మరణం

దౌల్తాబాద్‌: మండల పరిధి కౌడీడ్‌ గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. సమాచారం మేరకు దాడి చేసి, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4100ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వేణు కుమార్‌ తెలిపారు.

ధారూరు: పట్టణంలోని ఠాణా సరికొత్తగా ముస్తాబైంది. పోలిస్‌స్టేషన్‌ అనగానే అమ్మో అనేవారి సైతం చూపు తిప్పుకోనియకుండా తీర్చిదిద్దారు. తొలుత లైట్‌ ఆరెంజ్‌ కలర్‌ఉండగా.. దాని స్థానంలో లైట్‌ బ్లూ, బార్డర్‌కు ముదురు నీలిరంగు వేయించారు. దీంతో వివిధ కేసుల నిమిత్తం వచ్చే వారు.. హౌస్‌ బాగుందని కితాబిస్తున్నారు. చుట్టూ చెట్లతో కూడిన ప్రదేశాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాండూరు రూరల్‌: పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దేముల్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రవీందర్‌(26), హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 25న ఖానాపూర్‌కు వచ్చాడు. అదే రోజు పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పరిగి: మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మున్సిపల్‌ పరిధిలోని మల్లెమోనిగూడలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహన్‌కృష్ణ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ అనంతమ్మ(55) చిన్నకుమారుడికి అనారోగ్య సమస్యలు తలెత్తండంతో చికిత్స నిమిత్తం అప్పులు చేసింది. రోగం నయం కాక రెండేళ్ల క్రితం కుమారుడు మృతి చెందాడు. అంతకు ముందే భర్త మరణించాడు. అప్పటి నుంచి మానసిక వేదనతో పాటు అప్పుల భారంతో మనోవేదనకు గురైంది. ఇటీవల గ్రామంలో ఇంటి జాగను అమ్మి కొంత అప్పు తీర్చింది. మిగిలిన అప్పు తీర్చే మార్గం లేక శనివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకుంది. గమనించిన పక్క పొలంవారు కుటింబీకులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement