దుద్యాల్: ఇక్రిసాట్‌లో కొడంగల్ నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఇస్తున్న మట్టి పరీక్షల శిక్షణ మంగళవారంతో ముగిసింది. రెండు రోజుల పాటు మట్టి నమూనాలు సేకరించు విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎండబెట్టు విధానం, ల్యాబ్‌లో పరీక్షలు తదితర అంశాలను వివరించారు. శిక్షణ కార్యక్రమానికి కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, వికారాబాద్ డీఏఓ రాజారత్నం, కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ నాగరాజు రైతులు రవి నాయక్, కరుణాకర్, శివ కుమార్, శ్రీనివాస్, నరేశ్, జగదీశ్, మొగులయ్య, శ్రీకాంత్, గోపాల్‌తో పాటు నియోజకర్గంలోని దుద్యాల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన 120 మంది రైతులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.


