ఉర్సు ఉత్సవాలు ఐక్యతకు చిహ్నం | - | Sakshi
Sakshi News home page

ఉర్సు ఉత్సవాలు ఐక్యతకు చిహ్నం

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

వృద్ధురాలి దారుణ హత్య చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతు యువకుడి అదృశ్యంపై కేసు నమోదు టీఎస్‌ఎస్‌ఓ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జిగా రేవంత్‌గౌడ్‌ కడ్తాల్‌: తెలంగాణ సోషల్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌(టీఎస్‌ఎస్‌ఓ) జిల్లా ఇన్‌చార్జిగా మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పాలకూర్ల రేవంత్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్‌ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌గౌడ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో టీఎస్‌ఎస్‌ఓ ఎల్లప్పుడు ముందుంటుందని, నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా టీఎస్‌ఎస్‌ఓ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞలు తెలిపారు.

ఎమ్మెల్సీ రహమత్‌బేగ్‌

పరిగి: మున్సిపల్‌ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఉర్సు ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఎమ్మెల్సీ రహమత్‌బేగ్‌, పలువురు ముఖ్య నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు ఉర్సు ఉత్సవాలు చిహ్నం అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు పాల్గొన్నారు.

కుల్కచర్ల: అదృశ్యమైన వృద్ధురాలు అస్తిపంజరమై దొరికింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని బండవెల్కిచర్లకు చెందిన వెంకటమ్మ(63) శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె కూతురు లక్ష్మి తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం కుల్కచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్‌ లిస్ట్‌ ఆధారంగా పక్కింటి మహిళ మంజులను విచారించగా తన భర్త భీమయ్యతో పాటు బంధువుల వ్యక్తి బీరయ్యతో కలిసి చంపినట్లు తేలింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసం ఆమెను బైక్‌పై ఎక్కించుకుని తిర్మలాపూర్‌ గ్రామ సమీపంలోని పాండవుల బండపైకి తీసుకెళ్లి గొంతునులిమి చంపారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

బంట్వారం: చెరువులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన మంగళవారం కోట్‌పల్లి మండలం ఇందోల్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శైలజ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి వెంకటయ్య (50) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో బురదలో చిక్కుకుని నీట మునిగాడు. స్థానికులు గమనించి విషయాన్ని కుటంబీకులకు సమాచారం అందించారు. చెరువులో గల్లంతైన వ్యక్తి కుమారుడు రమేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.

కేశంపేట: ఫోన్‌ పే నుంచి డబ్బులు ఎక్కడి పంపించావు అని తల్లి అడిగితే కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మండలంలోని మంగళిగూడ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏశమోని అంజయ్యయాదమ్మ దంపతులకు కొడుకు శ్రీకాంత్‌ ఉన్నారు. గత నెల 26వ తేదీన ఆరోగ్యం బాలేదని దవాఖానాకు వెళ్లడాలని శ్రీకాంత్‌ను రూ.4వేలు ఇవ్వమని తండ్రి అడిగారు. ఫోన్‌ పే నుంచి డబ్బులు వెళ్లడం లేదని కొడుకు చెప్పారు. అదే సమయంలో డబ్బులు ఇవ్వకుండా ఫోన్‌ పే నుంచి రూ.వెయ్యి ఎవరికి పంపించావని తల్లి కొడుకును ప్రశ్నించింది. ఆ రోజు శ్రీకాంత్‌ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బైక్‌పై వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని, అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement