అనంతగిరి: పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శిచేందుకు మాజీ మత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు తిప్పుతూ ఎక్కడి వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి పరిగి పర్యటనకు బయలు దేరడంతో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకుని శంషాబాద్ ఠాణాకు తరలించారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, కౌన్సిలర్ పాండు, నాయకులు షఫీ, తదితరులను పోలీసులను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. అరెస్ట్‌లు, కేసులు బీఆర్‌ఎస్‌కు కొత్తకాదన్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేసేది పోయి వారి భూములను లాక్కోవడం సరికాదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్


