ఆమనగల్లు: కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. మేడిగడ్డతండా పరిధిలోని గుడితండాలో కవిత, రవీందర్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. కవిత, రవీందర్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడిగడ్డతండా సర్పంచ్ రాజేశ్వరి, ఉపసర్పంచ్ విజయ్‌రాథోడ్, మాజీ సర్పంచ్ అంబర్‌సింగ్, నాయకులు మల్లేశ్ నాయక్, సీతారాం, ప్రేమలత, మల్లేశ్, తావుర్యా, దేవ, శ్రీను, హర్య తదితరులు పాల్గొన్నారు.


