భవన నిర్మాణం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణం ప్రారంభం

Mar 22 2026 1:26 AM | Updated on Mar 22 2026 1:26 AM

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో నూతనంగా చేపట్టిన గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని శనివారం సర్పంచ్‌ ఇమ్మడి మహేశ్‌ ప్రారంభించారు. రూ.10 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌, మాజీ సర్పంచ్‌ రమేశ్‌, స్థానికులు రమేశ్‌, అరుణ, సత్యం, శంకరయ్య, హుస్సేన్‌, శ్రీనివాసులు, లింగం, సంతోష, రాజు, బాగ్యమ్మ, యాదయ్య, సువర్ణ, సంతోష తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆమనగల్లు మండలం శెట్టిపల్లి లో మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణ పనులను సర్పంచ్‌ తెలగమల్ల జంగమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కృష్ణప్రసాద్‌, స్థానిక నాయకులు వెంకటయ్య, దామోదర్‌రావ్‌, యాదయ్య, రా ములు, రమేశ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement