కడ్తాల్: మండల పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన వడ్త్యావత్ నంద్యానాయక్ ఆకస్మికంగా మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని శనివారం ఉదయం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్‌నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఎక్వాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంద్రానగర్‌తండాలో మృతి చెందిన సభావత్ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. స్థానిక నాయకులు మహేశ్‌యాదవ్ తనవంతుగా రూ.5 వేలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, నాయకులు వెంకటయ్య, రాజునాయక్, మల్లేశ్, శ్రీశైలం, గోపీ, బాలు, మహేశ్ తదితరులు ఉన్నారు.
తండా అభివృద్ధే ధ్యేయం
కడ్తాల్: గానుగుమర్లతండాను అభివృద్ధే ధ్యే యమని సర్పంచ్ సేవ్యానాయక్ అన్నారు. తండాలోని 2వ వార్డులో జీపీ నిధులతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో మౌ లిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతో పాటు నీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అఖిల, గణేశ్, శ్రీను, స్వప్న, రాజు, నాగార్జున్, కవిత, గోపీ, చాంది, పాండు, భీమన్, సకృ, కిషన్, హీరాసింగ్, లాలునాయక్, శ్రీను, ఉన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములివ్వం
యాచారం: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి భూము లు ఇచ్చేది లేదని కుర్మిద్ద గిరిజన రైతులు స్పష్టం చేశారు. సాగు నేలలు ఇవ్వమని వారు చేస్తున్న దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరింది. దీక్షకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్‌పతి నాయక్‌లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు రద్దుచేయడంతో పాటు.. సాగు భూములను తీసుకోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నేతలు కిషన్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
మాజీ డీజీపీ మనవరాలికి రూ.1.20 కోట్ల టోకరా
Oòßæ-§ýl-Æ>-»ê§Šæ OòܺƊæ u>×êÌZ MóSçÜ$ ¯]lÐðl*§ýl$
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులే కాదు పోలీసులు, లాయర్లను కూడా సైబర్ నేరస్తులు అలవోకగా మోసం చేస్తున్నారు. తాజాగా మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బంజారాహిల్స్‌కు చెందిన మాజీ డీజీపీ మనవరాలు దివ్యారెడ్డి (48) పలు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరు, ఫొటోతో ఉన్న వాట్సప్ ఖాతా నుంచి ఆమె అకౌంటెంట్‌కు మెసేజ్ వచ్చింది. తాను మీటింగ్ లో ఉన్నానని.. తాను సూచించిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని మెసేజ్ రావడంతో అకౌంటెంట్ ఆ సొమ్మును ఆమె సూచించిన ఢిల్లీకి చెందిన ఒక సంస్థ బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా నిధులను బదిలీ చేశారు. నాలుగు రోజుల తర్వాత, అదే వాట్సాప్ నంబర్ నుంచి తమిళనాడుకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఖాతాకు మరో రూ.18 లక్షలు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


