కొడంగల్ రూరల్: పట్టణ శివారులోని సిద్ధనొంపు రోడ్ సమీపంలో వెలసిన శ్రీచౌడేశ్వరి అమ్మ వారి జ్యోతి ఉత్సవాలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం జల్దిబిందె, అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, దూపం, దీపం, నైవే ద్యం సమర్పిస్తూ మంగళహారతులు అందించా రు. రాత్రి 8 గంటల నుంచి భజన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఖడ్గాలు వేస్తూ అమ్మవారిని స్మరించుకున్నారు. ఆది వా రం ఉదయం 10గంటలకు అమ్మవారి ఆల యం ముందు పెరుగు బసంతం నిర్వహించనున్న ట్లు ఆలయ నిర్వాహకులు సంకారపు పవన్‌కు మార్, సంకారపు శివకుమార్, గౌరవ సలహాదారులు మంచన్‌పల్లి నర్సిములు తెలిపారు.


