మహిళల హక్కుల పరిరక్షణకు కృషి
దోమ: మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని మా భరోసా కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత అన్నారు. బుధవారం మండల పరిధి బొంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ వెంకట్‌తో కలసి విద్యార్థులకు మా భరోసాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవసరమైన సమయంలో భరోసా సభ్యులు మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడతారన్నారు. వారికి ఎక్కడైనా ఎదైనా జరిగితే 100 డయల్ చేయాలని సూచించారు. అతివల పక్షాన నిలబడి, న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు షఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


