సీసీ కెమెరాలతో నేరాల అదుపు
తాండూరు రూరల్: ప్రతి ఊరిలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పెద్దేముల్ ఎస్‌ఐ శంకర్ సూచించారు. పెద్దేముల్ మండలం ఓంమ్లనాయక్ తండా సర్పంచు సుమిత్ర భాయితో కలిసి కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటాయన్నారు. అంతేకాకుండా గ్రామస్తుల సహకారంతో సీసీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దుగ్గాపూర్, చైతన్యనగర్, ఓంమ్లనాయక్ తండాలో ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


