చేపలు పట్టేందుకు శిక్షణ
దుద్యాల్: మత్స్యకారుల సంఘంలో చేరేందుకు దుద్యాల్‌కు చెందిన ముదిరాజులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా బుధవారం స్థానిక చెరువులో చేపలకు వల వేసే నైపుణ్యంపై శిక్షణ ఇచ్చారు. గతంలో 232 మంది మత్స్యకారులు ఉండగా ప్రస్తుతం 65 మంది మాత్రమే మిగిలారు. మరో 70 మంది సభ్యులను చేర్చుటకు అవకాశం ఉండడంతో వారికి చేపలు పట్టే విధానాన్ని నేర్పిస్తున్నారు. నీటిలో వల వేయడం, చెరువులో ఈదడం వంటివి నేర్చుకుంటున్నారు. ఈ నెల 31న జిల్లా కేంద్రంలో మత్స్యకారులుగా చేరుటకు సంబంధించిన పరీక్షను జిల్లా మత్స్య సహకార శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.


