మూడు ఇళ్లు దగ్ధం
పరిగి: పట్టణ కేంద్రంలోని మల్లెమోనిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకేసారి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మల్లెమోనిగూడలో రసూల్‌బీ, బషీర్, మౌలానా ముగ్గురు ఇంటికి తాళాలు వేసి పొలాలకు వెళ్లారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు చెలరేగాయి. ఇల్లు మూడు ఒకే దగ్గరలో ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా అప్పటికే తీవ్ర నష్టం జరిగింది. బషీర్‌కు చెందిన రెండు మేకపిల్లలు సజీవదహనం కాగా ముగ్గురు బాధితులకు కలిపి రూ.మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.


