సత్తాచాటిన తాండూరు విద్యార్థులు
తాండూరు టౌన్: బాల వైజ్ఞానిక జిల్లా ప్రదర్శనలో తాండూరు విద్యార్థులు సత్తాచాటి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం పరిగిలోని నంబర్‌వన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్‌లో కృష్ణవేణి కాన్సెప్ట్ హైస్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కె.మనస్వి సీనియర్స్ విభాగంలో, అభ్యాస్ హైస్కూల్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శ్రీవర్ష జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానాల్లో నిలిచారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు ప్రశాంత్, జనార్దన్‌రెడ్డి, విద్యార్థులను అభినందించారు.
రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక
పోటీలకు ఎంపిక
సత్తాచాటిన తాండూరు విద్యార్థులు


