అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
● రూ.2 కోట్ల సీఎంఆర్‌ఎఫ్
చెక్కుల పంపిణీ
కొడంగల్: అన్ని రంగాల్లో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కడా కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 365 కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్, కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి మండలాలకు చెందిన పలువురు బాధితులకు రూ.రెండు కోట్ల విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ను రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రిని విస్తరించి 220 బెడ్ల సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేశామన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, నాయకులు ప్రశాంత్, యూసూఫ్, నయీమ్, ఆసిఫ్‌ఖాన్, కృష్ణంరాజు, శ్రీనివాస్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


