కళాకారులకు సంక్షేమ నిధి అమలు
బొంరాస్‌పేట: ఉగాది పండుగలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులకు ్ఙససంక్షేమ నిధిశ్రీ అనే స్వయం వాటాధనం కార్యక్రమం అమలుకానున్నట్లు ప్రభుత్వ మాజీ సలహాదారులు, టీఆర్‌జేకేఎస్ రాష్ట్ర సలహాదారు కేవీ రమణ ఐఏఎస్ ప్రకటించారని జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో భాషాసాంస్కృతికశాఖ సహకారం, టీఆర్‌జేకేఎస్ ఆధర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో రాష్ట్ర సదస్సు జరిగిందన్నారు. సంక్షేమ నిధితో ప్రతి కళాకారుడికి ఆరోగ్యం, అత్యవసర, ప్రాణాపాయ స్థితిలో ఎంతో సహాపయడుతుందన్నారు. జానపద కళాకారులకు సారిపల్లి కొండల్‌రావు అందిస్తున్న ఆర్థికసాయం అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సంఘం గుర్తింపుకార్డులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధానకార్యదర్శి లింగయ్య, నాయకులు విజయశ్రీ, కవిత, సునీత, శ్రవణ్, తులసి, లలిత, లావణ్య, నరేశ్‌కుమార్, అంజిలయ్య, వెంకటయ్య, శివకుమార్ తదితరులున్నారు.


