మత్స్య సంపదతో ఉపాధి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● లక్నాపూర్ ప్రాజెక్టులోకి చేప పిల్లలు
పరిగి: చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందవచ్చని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం లక్నాపూర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. సబ్సిడీ పరికరాలను సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నందున చేప పిల్లల ఎదుగుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, జిల్లా మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారధి పంతులు తదితరులు పాల్గొన్నారు.
రూ.61 కోట్లతో పరిగి పట్టణాభివృద్ధి
పరిగి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గతంలో రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు టెండ ర్లు పిలిచినట్లు తెలిపారు. రూ.16 కోట్లు వెచ్చించి తాగునీటి సమస్య పరిష్కారం కోసం ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వివరించారు. పరిగి పట్టణ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రూ.61 కోట్లతో మున్సిపాలిటీలో రోడ్లు వేయనున్నట్లు తెలి పారు. జాఫర్‌పల్లి సమీపంలో 140 ఎకరాల్లో అర్బ న్ పార్క్ నిర్మాణం జరుగుతోందన్నారు. అనంతర ం పట్టణంలో వంద పడకల ఆస్మత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.


