చలి.. వణుకు!
బషీరాబాద్: జిల్లాలో చలి పంజా విసురుతోంది. దీని ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 8.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 12న కనిష్టంగా 12.8 డిగ్రీలుగా నమోదైన టెంపరేచర్ మూడు రోజుల్లోనే 4 డిగ్రీలు పడిపోవడం చలిత్రీవతకు అద్దం పడుతోంది. మర్పల్లి, బంట్వారం మండలాల్లో 9.6 డిగ్రీల లోపు రికార్డయింది. కుల్కచర్లలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 32.7గా నమోదైంది. ఈలెక్కన పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. గత ఏడాది నవంబర్ రెండో వారంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలకతో పోలిస్తే ఈసారి చలి మరింతగా పెరిగింది.
14టీఎన్‌డీ122)
ప్రాంతం కనిష్టం గరిష్టం
మోమిన్‌పేట 8.7 30.1
మర్పల్లి 9.5 32.1
బంట్వారం 9.6 32.6
పూడూరు 10.3 30.4
నవాబుపేట 10.4 30.8
పెద్దేముల్ 10.7 30.1
కోట్‌పల్లి 11.0 30.2
ధారూరు 11.1 30.1
బొంరాస్‌పేట 11.5 31.0
దుద్యాల 12.1 29.4
బషీరాబాద్ 12.3 30.1
వికారాబాద్ 12.4 30.8
పరిగి 12.5 31.8
యాలాల 12.6 30.1
కొడంగల్ 12.6 30.1
దౌల్తాబాద్ 12.7 29.6
8.7 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
రెండు రోజులోన్లే 4 డిగ్రీలు పతనం
బయటకు రావడానికి జంకుతున్న జనం


