పట్టణ వాసులకూ ‘ఇందిరమ్మ’
తాండూరు రూరల్: త్వరలో పట్టణ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద 120 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ ప్రతి వార్డులో పర్యటించి అర్హులను ఎంపిక చేస్తుందన్నారు. ఖంజాపూర్ వద్ద నిర్మించిన 500 డబుల్ బెడ్ రూమ్‌లకు మరమ్మతులు చేసి పేదలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. పథకాల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించరాదని సూచించారు. ఎవరైనా డబ్బు అడిగితే నాకు నేరుగాఫోన్ చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ముగిసింది.. ఇక స్థానిక సందడే అన్నారు. ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, నాయకులుఉత్తమ్‌చంద్, రాజ్‌కుమార్, శరణు బసప్ప, రాము యాదవ్, జగదీష్, హరీశ్వర్‌రెడ్డి, వడ్డె శ్రీను, జర్నప్ప, ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
యాలాల: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవనూరు, యాలాల, సంగెంకుర్దు, బెన్నూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యం విక్రయించిన వెంలనే డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. సరైన తేమశాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం దేవనూరు గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ బాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, డైరెక్టర్లు ఖాసీం, మొగులయ్య, కాంగ్రెస్ నాయకులు భీమప్ప, అనిల్‌కుమార్, హన్మంతు, మహిపాల్, అక్బర్‌బాబా, అమృతయ్య, పేరి రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


