రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
● ప్రజల ప్రాణాలు కాపాడుదాం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
● కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీసమావేశం
అనంతగిరి: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసు, రవాణా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాద స్థలాలను గుర్తించి రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించాలన్నారు. స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఆటోల్లో నిబంధనల మేరకు ప్రయాణికులు వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అదనపు ఎస్పీ రాములు నాయక్, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉమేష్, శ్రీధర్ రెడ్డి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, డీఎస్పీలు, ఎకై ్సజ్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


