కాంగ్రెస్ సంబురాలు
అనంతగిరి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరాస్తాలో వికారాబాద్ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు బ్రహ్మరథం
మర్పల్లి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యా లయ ఆవరణలో మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్, పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పాలనకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సర్వేశ్, సీనియర్ నాయకులు సలీం, వడ్ల వెంకటేశం, శేఖర్ యాదవ్, పాండునాయక్, వినోద్‌శర్మ, భరత్, నర్సింలు యాదవ్, ధరమ్‌సింగ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


