
సీసీ కెమెరాలతో నేరాల అదుపు
దోమ: శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తున్నాయని.. ప్రతీ గ్రామంలో తప్పక ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఐ వసంత్‌జాదవ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని బొంపల్లిలో ఆయన సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, దుకాణాలు, కాలనీలు, ఇళ్ల వద్ద తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములు, శేఖర్, రాములు, షేర్ ఖాన్, షఫీ, రమేష్, ఇంతియాజ్, మధు, బాబు, తదితరు లు పాల్గొన్నారు. అంతకు ముందు బాస్పల్లి గ్రామ సమీపంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింలు పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఎస్‌ఐ వసంత్ జాదవ్