మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Sep 30 2025 9:06 AM | Updated on Sep 30 2025 9:06 AM

మహిళల

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌

జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు

తాండూరు రూరల్‌: మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు, సమాజం బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు అన్నారు. సోమవారం మండలంలోని జినుగుర్తి గ్రామంలో పీహెచ్‌సీ వద్ద స్వస్థనారి స్వశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనంతరం డాక్టర్‌ రషీద్‌ మాట్లాడుతూ.. 200 మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంలింగారెడ్డి, అజ్మత్‌ అలీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలి

అంగన్‌వాడీ టీచర్స్‌,హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి

కొడంగల్‌ రూరల్‌: అంగన్‌వాడీలు హక్కుల సాధన కోసం శాంతియుత ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టడం సరికాదని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. సోమ వారం పట్టణంలో సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రీ ప్రైమరీ విద్యను విరమించుకోవాలనే డిమాండ్‌తో సీఎం ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమపై కేసులు పెట్టారని, వెంటనే ఎత్తివేయాలన్నారు. ప్రభు త్వం ముందు ఉంచిన 18 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

సత్వరం పరిష్కరించాలి

అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ ఆయా శాఖ ల అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 43 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఆర్‌డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో

సత్తా చాటుతాం

తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సునీత ఇంటి నిర్మా ణం పూర్తి చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు గోపాల్‌, నారాయణరెడ్డి, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, లొంక నర్సింలు, ఉప్పరి మల్లేశం, రియాజ్‌, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

అస్తిత్వ పోరాటానికి

సిద్ధం కావాలి

షాద్‌నగర్‌: అస్తిత్వ పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ మాల పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపట్టే ఎస్సీ ఉప వర్గీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రోస్టర్‌ పాయింట్లను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం నవంబర్‌ 2న హైదరాబాద్‌లో భారీ ఎత్తున మాలల రణభేరి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి 
1
1/2

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి 
2
2/2

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement