
కోడ్ పక్కాగా అమలు చేయాలి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలి కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ప్రతీక్‌జైన్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ ప్రచారాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగీలాల్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.