వైభవం.. వేంకటేశ్వర కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం

Sep 29 2025 9:37 AM | Updated on Sep 29 2025 9:37 AM

వైభవం

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి స్వామి వారిని అశ్వవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై అనంతుడు

వికారాబాద్‌లోని ఆలంపల్లిలో వెలిసిన లక్ష్మీఅనంతపద్మనాభ స్వామి వారు ఆదివారం రాత్రి సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఆలయ మాడ వీధుల్లో భక్తుల హరినామస్మరణ నడుమ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం 1
1/2

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం 2
2/2

వైభవం.. వేంకటేశ్వర కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement