
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ
అనంతగిరి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబురమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో డీఆర్‌డీఏ, మెప్మా, ఉద్యానవన, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరీమాత పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. కలెక్టర్ బతుకమ్మ ఆట ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగీ లాల్, అడిషనల్ డీఆర్‌డీఏ నర్శింహులు, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, డీపీఓ జయసుధ, డ్వాక్వా గ్రూపు మహిళలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ