
బీజేపీలో అందరికీ సమ ప్రాధాన్యత
తాండూరు టౌన్: బీజేపీ అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని హరిజన వాడలో జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, నరేందర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, లాల య్య, విక్రాంత్, అంబదాస్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో పార్టీ నాయకులు భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, నాయకులు మల్లేష్, కృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, కిరణ్, నరేష్, సంగమేశ్వర్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.