
కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు షురూ..
జిల్లాలో మొత్తం షాపులు 59 రిజర్వ్‌డ్ చేసినవి 17 లాటరీ ద్వారా ఎస్సీలకు 9, ఎస్టీలకు 2, గౌడలకు 6కేటాయింపు నేటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 23న లాటరీ పద్ధతిన షాపుల కేటాయింపు
అనంతగిరి: జిల్లాలో నూతన మద్యం పాలసీ 2025– 27 సంవత్సరానికి గాను 59 షాపులకు టెండర్లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా 17 దుకా ణాలను వివిధ కేటగిరీలకు కేటాయించినట్లు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆబ్కారి శాఖ ఆధ్వర్యంలో నూతన మద్యం దుకాణాల కేటాయింపుపై సమావేశం నిర్వహించారు. ఎస్సీ కేటగిరికి 9, ఎస్టీలకు 2, గౌడ కులస్థులకు 6 కేటాయించం జరిగిందని తెలిపారు. మిగిలిన 42 దుకాణాలకు ఓపెన్ కేటగిరి కిందకు వస్తాయన్నారు. ఆసక్తి గల వారు రూ.3.3 లక్షలు (నాన్ రీఫండబుల్)డీడీ తీసి దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 23న కలెక్టరేట్‌లో లాటరీ తీయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా ఆబ్కారీ అధికారి విజయ భాస్కర్, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాధవరెడ్డి పాల్గొన్నారు.