
రాజీవ్ గృహకల్పలో కార్డన్ సెర్చ్
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 9మంది ఎస్‌ఐలు, 6గురు ఏఎస్‌ఐలు, 45మంది సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కాలనీలోని అన్ని నివాసాల వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమా నాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు, సరైన ధ్రువపత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 2ఆటోలు, మరో ఫోర్ వీలర్‌ను సీజ్ చేశారు. కార్యక్రమంలో వికారా బాద్ టౌన్ సీఐ భీంకుమార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.