
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
వికారాబాద్ పట్టణంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు బుధవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. 11 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవాల్లో బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం పీఠాఽధిపతి డాక్టర్.మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కూచిపూడి నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. – అనంతగిరి
చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారు

చంద్రప్రభ వాహనంపై శ్రీవారు

చంద్రప్రభ వాహనంపై శ్రీవారు