
ఇంట్లోకి చొరబడి.. పుస్తెలతాడును అపహరించి
శంకర్‌పల్లి: వంట గదిలో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడును అపహరించారు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండకల్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(82), పద్మమ్(70) దంపతులు. వీరితో కుమారుడు, కోడలు ఉంటున్నారు. బుధవారం కుమారుడు, కోడలు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం భర్తకు భోజనం పెట్టేందుకు ఆమె వంట గదిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు.. ఇంటి ముందు ఆగారు. ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడుని లాక్కొని.. వెంట వచ్చిన వ్యక్తితో బైక్‌పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వీరబాబు, డీఐ సమరంరెడ్డి వివరాలు సేకరించారు. చుట్టూ పక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వెలిమల గ్రామం వైపు వెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బైక్‌పై ఉడాయించిన దుండగులు