
భవిష్యత్ సేంద్రియ వ్యవసాయానిదే
తాండూరు రూరల్: భవిష్యత్ కాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయంవైపే మొగ్గు చూపుతారని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జినుగుర్తి గ్రామ శివారులో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లోని వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై(ఎన్‌ఎస్‌ఎస్) శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ రావు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సేంద్రియ వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుల మందు లు వాడకంతో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ నెల 29 వరకు విద్యార్థులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ గీత, డాక్టర్ అర్చన కర్ణి, డాక్టర్ రేవతిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు