
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
అనంతగిరి: పెండింగ్ కేసులపై ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై పీఎస్ వారీగా సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులపై డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. నేర నియంత్రణలో, పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాధాన్యత చాలా వరకు ఉంటుందన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులకు రూంలు అద్దెకు ఇచ్చే ముందు వారి అడ్రస్, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు తీసుకోవాలని ఇళ్ల యజమానులకు సూచించారు. రౌడీ షీటర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములునాయక్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి