
సత్తాచాటిన ఆదిత్యవర్ధన్
తాండూరు: యాలా ల మండలం బండమీదిపల్లికి పద్మ నర్సింహులు దంపతుల కుమారుడు ఆదిత్యవర్ధన్ నీట్ ప్రవేశ పరీక్షలో సత్తాచాటి ఎంబీబీఎస్ సీటు సాఽధించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ గురుకులాల్లోనే చదువుకున్నాడు. నీట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు దక్కించుకున్నారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అభినందించారు. విద్యార్థిని శాలు వాతో సన్మానించారు.