
స్వచ్ఛత విరియాలి.. వాడలు మెరవాలి
అవగాహన కల్పిస్తున్నాం
షాద్‌నగర్: పల్లెలు, పట్టణాలు సంపూర్ణ స్వచ్ఛత సాధించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ వివిధ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీఒక్క అడుగు స్వచ్ఛత వైపుశ్రీ నినాదంతో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పక్షం రోజుల పాటు రోజుకో కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి
కార్యక్రమాలు ఇలా..
● ఈనెల 22న గ్రామాల్లో నీటి క్లోరినేషన్, తాగు నీటి ట్యాంకుల శుభ్రత, పారిశుద్ధ్యంపై ఇంటింటి ప్రచారం
● 23న ఉత్సవ కమిటీల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు
● 24న డ్రైనేజీల్లో చెత్త తొలగింపు, ఇంకుడు గుంతల నిర్మాణం
● 25న శ్రమదానం, చెత్త తొలగించిన చోట మొక్కలు నాటడం
● 26న డ్రైడే, మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తపై అవగాహన, గ్రామాల్లో దోమల నివారణ చర్యలు, ఫాగింగ్, బ్లీచింగ్ చేయడం
● 27న పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, బీమా పత్రాల పంపిణీ, ఉత్తమ సిబ్బందికి సన్మానాలు
● 29న ప్లాస్టిక్ వాడకంపై అవగాహన, ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం, మహిళా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు
● 30న గ్రామాల్లో విస్తృతంగా శ్రమదాన కార్యక్రమాలు
● అక్టోబర్ 1న పనికి రాని పాత వస్తువులతో అలంకరణ వస్తువుల తయారీ, వీధుల్లో శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీపై అవగాహన, మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్
● 2న ప్రభాత భేరి, గ్రామ సభల నిర్వహణ, ఉత్తమ పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానాలు.
పల్లెలు, పట్టణాల్లో కొనసాగుతున్న ‘స్వచ్ఛతాహీ సేవ’
అక్టోబర్ 2 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
పరిశుభ్రత, దోమల నివారణ, స్వచ్ఛతపై అవగాహన
స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పరిశుభ్రత, ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
– సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్‌నగర్