
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
శంకర్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్‌పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్పరెడ్డి గూడేనికి చెందిన కుమ్మరి దశరథ్(38) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దశరథ్‌కి అనారోగ్య సమస్యలు రావడంతో డాక్టర్ మద్యం తాగొద్దని సూచించారు. అయినప్పటికీ తాగడం మానకపోవడంతో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందని దశరథ్ ఇంట్లో గది లోపలికి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామేలు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో ఆదివారం కేవీపీఎస్, జనవిజ్ఞాన వేదిక, ప్రజానాట్యమండలి సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సామేలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం కుల, మత తారతమ్యాలు లేకుండా జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని త్రిశక్తి కాలనీలో తెలంగాణ సాయుధ పోరాటం వీధి నాటకం రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తారన్నారు. తెలంగాణ సాహితి సంస్థ జిల్లా కన్వీనర్ సత్తన్న, ఆలేటి ఆటం తదితరులు పాల్గొన్నారు.